విశాఖలోని నోవాటెల్ బీచ్ వద్ద పార్వతీపురానికి చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. సముద్రంలోకి వెళ్లిపోతున్న ఆమెను గమనించిన లైఫ్ గార్డులు, మెరైన్ పోలీసులు అప్రమత్తమై వెంటనే రక్షించి బయటకు తీసుకొచ్చారు. అనంతరం చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో ఆమెను కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
బీచ్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన లైఫ్ గార్డులు


