విశాఖపట్నంలోని ప్రముఖ బౌద్ధ పర్యాటక ప్రాంతం తొట్లకొండను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో పాటు 11 బ్రిక్స్ దేశాల యువజన, క్రీడా మంత్రులు, ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మొక్కలు నాటారు. మహా స్థూపం, బావులు, పాకశాల, ధ్యాన కేంద్రాలను పరిశీలించారు. తొట్లకొండ చారిత్రక, బౌద్ధ విశిష్టతలను గైడ్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్
తొట్లకొండను సందర్శించిన 11 బ్రిక్స్ దేశాల ప్రతినిధులు


