శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మీదేవి శనివారం ఉండవల్లిలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన భర్త విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను సీఎంకు అందజేసి, విగ్రహాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అనంతరం రాష్ట్ర మంత్రి లోకేష్‌ను కూడా ఆమె కలిశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంను కలిసిన గుండ లక్ష్మీదేవి


