హైదరాబాద్: 28°C
తెలంగాణ

అద్దె ఇంటి కోసం వచ్చి మంగళసూత్రం చోరీ..!

NLG: అద్దెకు ఇల్లు కావాలని ఇంట్లోకి ప్రవేశించి మహిళ మెడలో మంగళసూత్రం దొంగలించిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై సురేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగులపల్లి గ్రామానికి చెందిన కుందూరు వసంతమ్మ (70) ఇంటికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఇల్లు అద్దెకు కావాలని చోరీకి పాల్పడ్డట్టు ఎస్సై తెలిపారు.