హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నేతల ఆర్థిక సాయం

SRPT: మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి చెందిన గౌరారపు యలమంద, లింగయ్య 15 రోజుల క్రితం ముకుందాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబాన్ని గ్రామ కాంగ్రెస్ నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ రూ. 30 వేల ఆర్థిక సాయం అందజేశారు.