హైదరాబాద్: 28°C
తెలంగాణ

తేమశాతం తగ్గి పంటలపై ప్రభావం

MNCL: దండేపల్లి మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పడిన పొడి వాతావరణంతో నేలలో తేమ శాతం తగ్గుతోంది. ఎల్ నివో ప్రభావంతో వ్యవసాయ అధికారుల సూచన మేరకు పలు గ్రామాల రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేశారు. పత్తి, కంది జొన్న, మొక్కజొన్న పంటలను రైతులు వేశారు. ఆయా పంటలకు నేలలో తేమశాతం ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు. అయితే చాలా రోజులుగా వర్షం కురవడం లేదు.