హైదరాబాద్: 28°C
తెలంగాణ

జగన్నాథ ఆలయానికి హైకోర్టు న్యాయమూర్తి

MNCL: చెన్నూరు పట్టణంలోని ప్రముఖ జగన్నాథ ఆలయాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ బీమాపాక శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న న్యాయమూర్తికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు.