NZB: బాల్కొండ మండలంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్టాపూర్ నుంచి శ్రీరాంపూర్ వెళ్లే మార్గంలో వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. మృతురాలి వయస్సు సుమారు 60 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. ఆకుపచ్చ రంగుచీర, పసుపురంగు జాకెట్ ధరించారని ఆమె వివరాలు తెలిస్తే బాల్కొండ పోలీస్ స్టేషను సంప్రదించాలని ఎస్సై శైలేందర్ తెలిపారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి.!


