హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిన్నంటిన పంచదార ధర

శ్రీకాకుళం: పంచదార ధర సామాన్యుడిపై భారం పడింది. వారం కిందట రూ.45–50గా ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ.75కు చేరింది. ఒక్కసారిగా రూ.25 వరకు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ధరలు అదుపులోకి రాకపోతే స్వీట్లు, టీ, కాఫీ, హార్లిక్స్‌, డ్రింక్స్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.