హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎటు చూసినా ఎండిన ఖాళీ దుక్కి భూములే

బాపట్ల జిల్లాలోని పలు గ్రామాల్లో ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడక పొలాలు ఎండిపోయి ఖాళీ దుక్కులుగా దర్శనమిస్తున్నాయి. ఆగస్టు నెల ఆఖరు దాటుతున్నా వర్షం జాడ లేకపోవడంతో, తీవ్రమైన వడగాలులతో వేసవి కాలాన్ని తలపిస్తున్నాయి. ఆగస్టు ముగింపుతో ఖరీఫ్ కాలం ముగుస్తుండటం, త్వరలో సెప్టెంబర్‌తో రబీ కాలం ప్రారంభం కానున్నప్పటికీ చినుకు జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.