హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..!

KMM: రఘునాథపాలెంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జింకలతండా వైపు వెళ్తున్న బైక్‌ను ఇల్లందు నుంచి ఖమ్మం వస్తున్న ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 8ఏళ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న వ్యక్తికి బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.