హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మినుము పంట నష్టం.. రైతుకు కన్నీళ్లు!

NDL: నందికొట్కూరుకు చెందిన రైతు వెంకటరెడ్డికి మినుము పంట కన్నీళ్లు మిగిల్చింది. 9 ఎకరాల్లో మినుము సాగు చేయగా సకాలంలో వర్షాలు కురవక పంట ఎదగలేదు. సొంత భూమి 3, మరో 6 ఎకరాలను ఎకరాకు రూ.20 వేల చొప్పున కౌలుకు తీసుకొని సాగుచేశారు. పంట చేతికొచ్చే దశలోనే వర్షాభావంతో ట్రాక్టర్‌తో దున్నివేశారు. పెట్టుబడి మొత్తం నష్టపోయానని రైతు కన్నీటి పర్యంతమయ్యారు.