హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీసీఈబీ పరీక్ష ఫీజుకు నేడే చివరి తేదీ

SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు డీసీఈబీ పరీక్ష ఫీజును నేడు చెల్లించాలని జిల్లా విద్యాధికారి రోహిణి సూచించారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా డీసీఈబీ ఫీజు చెల్లించని పాఠశాలలకు ప్రశ్న పత్రాలు పంపించబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు గమనించాలన్నారు.