హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలేరులో తగ్గిన వరి సాగు.!

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. వర్షాలు సకాలంలో పడకపోవడమే ఇందుకు కారణమని వ్యవసాయ అధికారులు తెలిపారు. గత వానాకాలంలో 78 వేల ఎకరాల్లో సాగు అవ్వగా, ఈసారి కేవలం 50,202 ఎకరాలకే పరిమితమైంది. తీవ్ర నీటి కొరత వల్ల రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.