హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బండ్లగూడ బాధితులకు న్యాయం చేయాలి'

MDK: బండ్లగూడలో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు రైల్వే అధికారులు న్యాయం చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు కోరారు. రైల్ నిలయంలో బాధితులతో కలిసి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఇళ్లను కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. బాధితుల వాదన విన్నాకే రైల్వే అధికారులు తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.