వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో శనివారం సందర్భంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణ, పూజలు, హారతి చేపట్టారు. వారాంతం కావడంతో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
తెలంగాణ
భద్రకాళి ఆలయంలో వైభవంగా శ్రావణమాస వేడుకలు


