హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

KRNL: కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బోయ క్రాంతినాయుడిపై కర్నూలు రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ నెల 16న పార్టీ కార్యాలయంలో తనను కులం పేరుతో దూషించి, చంపేస్తానని బెదిరించారని ఆరోపిస్తూ కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యుడు అనంతరత్నం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.