హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

దండాసనం వల్ల కలిగే ఉపయోగాలు

దండాసనం వేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వెన్నునొప్పిని తగ్గించి, వెన్నుముకను దృఢంగా మారుస్తుంది. ఉదర భాగంలోని అవయవాలను ఉత్తేజపరిచి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. తొడ కండరాలు, పిక్కల భాగంలో ఒత్తిడిని తగ్గించి వశ్యతను పెంచుతుంది. కాళ్లు, కింది శరీర భాగాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఏకాగ్రతను పెంచి ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది.