హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1400.84 అడుగులకు చేరింది. శనివారం ఉదయం ప్రాజెక్టులో 12.284 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 1402.78 అడుగుల నీటిమట్టంతో 14.697 టీఎంసీల నిల్వ ఉండేది. 24 గంటల్లో ప్రాజెక్టుకు సగటున 200 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరింది.