హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యలు తెలుసుకున్న సీపీఐ నాయకులు

HNK: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) హన్మకొండ మండల కమిటీ నాయకులు శుక్రవారం సాయంత్రం 31వ డివిజన్ పరిధిలోని జేపీనగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత 20 ఏళ్లుగా ఇక్కడ అభివృద్ధి లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పాలకులు వెంటనే కాలనీవాసుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.