E.G: రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు 11 ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీ చొరవ చూపి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. పుష్కరాలకు ముందే ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
11 ఏళ్లుగా ఎన్నికలు లేవు: కాంగ్రెస్


