హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు'

అల్లూరి జిల్లాలో రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆదిలక్ష్మి తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు డివిజన్లలో 2.7 నుంచి 5.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. గాలిలో తేమ 82 నుంచి 87 శాతం ఉంటుందని వివరించారు.