కాకినాడ ఆర్టీసీ డిపో నూతన డిపో మేనేజర్ గంగుమళ్ల రమా లక్ష్మీదేవి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు అమలాపురం డిపోలో అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించిన ఆమెకు పదోన్నతిపై కాకినాడ డిపో మేనేజర్‌గా నియామకం లభించింది. కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారిగా పదోన్నతి పొందిన ఎంయువి మనోహర్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా లక్ష్మీదేవి బాధ్యతల స్వీకరణ


