హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్ద వెంతుర్లలో పర్యటించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

NDL: కొలిమిగుండ్ల మండలం పెద్ద వెంతుర్ల గ్రామంలో శుక్రవారం టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల రామేశ్వర్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక టిడిపి నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను ఆయన ప్రజలకు పంపిణీ చేశారు.