హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రేమ వివాహం.. రక్షణ కోరుతూ..!

అన్నమయ్య: చిన్నమండెం మండలానికి చెందిన ఆదినారాయణ, లావణ్య ఈనెల 19న రామాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. లావణ్య తల్లిదండ్రులు, బంధువుల నుంచి ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ శుక్రవారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌ను ఆశ్రయించారు. తమకు పోలీసుల రక్షణ కల్పించాలని కోరారు. ఇద్దరూ మేజర్లమని, రాయచోటి రూరల్ పోలీసులు లావణ్య తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారని తెలిపారు.