హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారం చోరీ.. ముగ్గురు అరెస్ట్

అన్నమయ్య: కేవీపల్లి మండలం లక్ష్మిరెడ్డిగారిపల్లిలో ఇంట్లో చోరీకి గురైన 77 గ్రాముల బంగారు నగల కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అప్సానా(19)తో పాటు ఖాజా(23), సలీమా(30)లను అరెస్ట్ చేశారు. 40 గ్రాముల బంగారాన్ని ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టగా, మరో 33.8 గ్రాముల నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు.