ASR: జీకేవీధి మండలం దారకొండ పీహెచ్‌సీలో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. అత్యవసర కేసులు వస్తే వైద్యం అందించేది ఎవరని, ఇలాంటి పరిస్థితులకు బాధ్యత ఎవరు వహిస్తారని వీడియోలో ప్రశ్నించారు. దారకొండ పీహెచ్‌సీలో వైద్య సేవలపై అధికారులు వెంటనే దృష్టి సారించాలని కోరారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: PHCలో సిబ్బంది లేరంటూ వీడియో వైరల్!


