హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యమ శంఖారావం

కడప: రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. 5 డీఏలు, ఐఆర్, పీఆర్సీ కమిషనర్ నియామకం, సీపీఎస్, జీపీఎస్ సమీక్షతో పాటు 29 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ నెల 28న రాష్ట్ర సదస్సులో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.