హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుపై పారుతున్న మురుగునీరు

PLD: నరసరావుపేట మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలోని వరవకట్ట జామియా మసీదు సమీపంలో మురుగునీరు రోడ్డుపై పొంగిపొర్లుతోంది. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో స్థానికులు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మురుగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.