కృష్ణా: పెడన నియోజకవర్గంలోని 217 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో బూత్ స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని రిటర్నింగ్ అధికారి పోతురాజు తెలిపారు. కొత్త ఓటు నమోదు, అభ్యంతరాలు, ఓటు బదిలీ తదితరాలకు దరఖాస్తులు స్వీకరిస్తారని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం


