KRNL: ఆస్పరి మండలం తంగరడోణలో ఈ నెల 22 నుంచి 24 వరకు శ్రీ చింతలముని, నల్లారెడ్డి స్వామి దశమి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త పి.పార్వతి తెలిపారు. 22న ప్రత్యేక పూజలు, స్వామివారికి ఆభరణాల అలంకరణ చేపడతామన్నారు. 23న అశ్వాన్ని గ్రామ వీధుల్లో ఊరేగిస్తామని, 24న సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు శ్రీ చింతలముని దశమి ఉత్సవాలు ప్రారంభం


