హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్కా జోలికి వెళ్తే తాటతీస్తాం: డీఎస్పీ

KRNL: ఆదోని పట్టణంలోని మట్కా బీటర్లకు శుక్రవారం సాయంత్రం డీఎస్పీ వెంకటరమణ కౌన్సెలింగ్ ఇచ్చారు. మట్కాను పూర్తిగా వదిలేసి, ఏవైనా ఇతర పనులు చేసుకోవాలని సూచించారు. ఉపాధి కోసం పోలీసు శాఖ తరఫున సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. మట్కా వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయి, సర్వనాశనమయ్యాయని గుర్తు చేశారు. ఇకపై మట్కాకు దూరంగా ఉండాలని డీఎస్పీ హెచ్చరించారు.