హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముద్ర లోన్ పేరుతో సైబర్ మోసాలు: ఎస్పీ

KRNL: ముద్ర లోన్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలు, రైతులను మోసం చేస్తున్నారని శుక్రవారం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్, జీఎస్టీ పేర్లతో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. OTP, ATM PIN, CVV వివరాలు చెప్పవద్దని, ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు.