హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజోలు ఎమ్మెల్యేకు కమిటీలో చోటు

కోనసీమ: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలు, వ్యూహాల రూపకల్పన కోసం పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక కమిటీని ప్రకటించారు. ప్రతిష్టాత్మకమైన 14 మంది సభ్యుల కమిటీలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కు చోటు దక్కింది. క్షేత్ర స్థాయి నుంచి ప్రజాభిప్రాయాలు, ఆలోచనలను ఈ కమిటీ సేకరించనుంది.