KDP: ముద్దనూరు మండలం పెద్దదుద్యాల గ్రామ పొలాల్లో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను గురువారం రాత్రి గుర్తుతెలియని దొంగలు ధ్వంసం చేసి కాపర్ వైరు చోరీ చేశారు. రైతు ప్రసాదరెడ్డి పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్‌ను బయటకు పారబోసి, కాపర్ వైరు ఎత్తుకెళ్లినట్లు ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం.. కాపర్ వైరు చోరీ'


