NDL: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం చంద్రవతి కల్యాణమండపంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1,800 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం పూజా సామగ్రిని సమకూర్చింది. వ్రతం అనంతరం స్వామిఅమ్మవార్ల దర్శనం, అన్నప్రసాదాలు కల్పించారు. భక్తులకు చీర, రవికవస్త్రం, తులసి మొక్క, ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
1,800 మందికి పైగా భక్తులతో వరలక్ష్మీ వ్రతం


