హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కృష్ణా: అవనిగడ్డ–పులిగడ్డ రహదారిపై సీతాయలంక వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వ్యాగనర్ కారును ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై ఉన్న మహిళకు స్వల్ప గాయాలు కావడంతో అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడిని మోపిదేవి మండలం నాగయతిప్పకు చెందిన అప్పారావుగా గుర్తించారు.