టాటా మోటార్స్ తమ కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. పెరుగుతున్న ఉత్పత్తి, ముడిసరుకుల వ్యయాల భారాన్ని తగ్గించుకోవడానికి సెప్టెంబర్ 1 నుంచి తమ ప్యాసింజర్, EV వాహనాల ధరలను రూ.25 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ ధరల మార్పు ఉంటుంది. కస్టమర్లపై భారం పడుతున్నా తప్పట్లేదని సంస్థ తెలిపింది. ఇప్పటికే మారుతీ, హ్యుందాయ్ సంస్థలూ కార్ల రేట్లు పెంచాయి.
వ్యాపారం
టాటా మోటార్స్ కార్ల ధరల పెంపు


