హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీని కమ్మేసిన పిచ్చి మొక్కలు.. మురుగు నీరు పారేదెలా?

ASR: చింతూరులోని గుబెలిపేట సీసీ రోడ్డు డ్రైనేజీ పిచ్చి మొక్కలతో పూర్తిగా కమ్ముకుపోయింది. మురగునీరు సరిగ్గా పారకపోవడంతో వ్యర్ధాలు బయటకి వచ్చి దుర్వసన వేదజళ్లుతున్నాయి అని స్థానికులు తెలిపారు. డ్రైనేజీ చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో పాములు తేళ్ళు సంచారం పెరిగిందని వాళ్ళు అందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే డ్రైనేజి శుభ్రచేయాలని వారు కోరారు.