హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

NDL: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు జారి చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ ఫ్లో 44,720, అవుట్ ఫ్లో 35,315 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలంలో ప్రస్తుత నీటి నిల్వ 167.4860 టీఎంసీలు ఉందని పేర్కొన్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందని తెలియజేశారు.