హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పువ్వులకు డిమాండ్.. ధరలకు రెక్కలు

శ్రీకాకుళం: శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతాల వేళ జిల్లా వ్యాప్తంగా పూలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. వ్యాపారులు ధరలు అమాంతం పెంచేయడంతో భక్తులు విధిలేక అధిక ధరలకే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో చామంతి కేజీ రూ. 500, బంతి రూ.300 పలుకుతుండగా, మల్లెలు మూర రూ.300, సన్నజాజులు రూ.250కి విక్రయిస్తున్నారు.