సత్యసాయి: హిందూపురం వన్ టౌన్ సీఐగా పనిచేస్తున్న కె. రాజగోపాలనాయుడిని తిరుపతి వీఆర్‌కు పంపిస్తూ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రి ఘటనలో బాధితుల ఆందోళన సందర్భంగా సీఐ అనుచితంగా ప్రవర్తించారని నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రచారం కావడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
హిందూపురం వన్ టౌన్ సీఐ వీఆర్‌కు బదిలీ


