హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరు మున్సిపాలిటీకి 28 వార్డులు!

ప్రకాశం: గిద్దలూరు పురపాలక సంఘం వార్డుల పునర్విభజనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీని 28 వార్డులుగా విభజిస్తూ కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ ఐఏఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 28 వార్డుల తుది హద్దుల వివరాలు గెజిట్‌లో ప్రచురించారు.