హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిట్టీల పేరుతో రూ.70 లక్షలు మోసం

కృష్ణా: గుడివాడలో చిట్టీల పేరుతో రూ.70 లక్షలు మోసం చేసినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వైసీపీ నేత మందాడి శ్రీనివాసరావు, ఆయన భార్య మహాలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 32 మంది బాధితులకు రూ.51.79 లక్షలు చెల్లించకుండా ఐపీ నోటీసులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల్లో ఎక్కువగా మత్స్యకార కుటుంబాలే ఉన్నట్లు సమాచారం.