హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పనితీరు బాగోలేకపోతే ఇంటికే

E.G: విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని.. ప్రజలకు సేవ చేయడానికి ఇష్టం లేనివారు ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చని మంత్రి కందుల దుర్గేష్‌ నిడదవోలు CHC సిబ్బందిని హెచ్చరించారు. నిన్న రాత్రి 10 గంటల సమయంలో CHCని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, జనరల్‌ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రి వేళల్లో సిబ్బంది, వైద్యులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు.