హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీహెచ్‌సీలకు నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే

BPT: పర్చూరు నియోజకవర్గంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గ పరిధిలోని వలపర్ల, మోటుపల్లి, పెద్దగంజాం గ్రామాల్లో పీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తే వేలాది మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు.