హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీ లేక గ్రామంలో దుస్థితి

VZM: గంట్యాడ మండలం వసంత గ్రామంలో డ్రైనేజీ సౌకర్యం లేక రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తోంది. ఇళ్ల నుంచి వచ్చే వాడుక నీరు వీధుల్లోనే నిలిచి దుర్వాసన వ్యాపిస్తోంది. దోమలు, ఈగల బెడదతో ప్రజలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని స్ధానికులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు రోడ్లపై నడవలేని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు.