హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శుక్రవారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 20-24 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి, కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న మొత్తం 70,114 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, 28,963 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.86 కోట్లు వచ్చినట్లు TTD అధికారులు తెలిపారు.