హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురం– ట్యూటికోరిన్ మధ్య ప్రత్యేక రైళ్లు

W.G: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నరసాపురం– ట్యూటికోరిన్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబరు 7 నుంచి 30 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయన్నారు. ట్యూటికోరిన్ – నరసాపురం ప్రత్యేక రైలు (06019) సెప్టెంబరు 7న రాత్రి 11.30 గంటలకు బయలుదేరుతుందన్నారు. తిరుగు రైలు (06020) సెప్టెంబరు 9న ఉదయం 4 గంటలకు నరసాపురం నుంచి బయలుదేరుతుందన్నారు.