ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం బీసీ కాలనీ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో తెలంగాణ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తూ దర్యాప్తు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
రెండు లారీలు ఢీ.. వ్యక్తి మృతి


